: గద్దర్ ‘మహాజన సమాజం’ తొలి కార్యాలయం ఏర్పాటు
ప్రజాగాయకుడు గద్దర్ స్థాపించిన ‘మహాజన సమాజం’ తొలి కార్యాలయాన్ని భువనగిరిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం భువనగిరి అని, త్వరలో మహాజన సమాజం పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆ సభలోనే ‘మహాజన సమాజం’ పార్టీ ఆవిర్భావం ఉంటుందని, ఉమ్మడి నల్గొండ జిల్లా విద్యార్థుల సమస్యలపై జూన్ లో ఓ యాత్ర నిర్వహించనున్నామని, ‘పల్లె పల్లె పాట.. పార్లమెంటుకు బాట’ పేరుతో ప్రజల ముందుకు వెళ్తామని గద్దర్ తెలిపారు.