: ప్రశాంతంగా ముగిసిన ‘నీట్’
ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశాంతంగా ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షను నిర్వహించారు. తెలంగాణాలో హైదరాబాద్, వరంగల్ లో, ఏపీలో విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, గుంటూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా నగరాలలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, సీబీఎస్ఈ పాఠశాలల్లో మాత్రమే పరీక్ష నిర్వహించారు. ఏపీ, తెలంగాణ నుంచి ఒక లక్షా యాభై వేల మంది విద్యార్థులు పరీక్ష రాసినట్టు సమాచారం.