: నేడో బాంబు పేలుతుంది: కేజ్రీవాల్ ను హెచ్చరించిన ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రా
ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీలో సంక్షోభం మరింతగా పెరిగింది. నీటి పారుదల మంత్రి కపిల్ మిశ్రాను సీఎం కేజ్రీవాల్ మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో, మిశ్రా తీవ్ర విమర్శలు చేశారు. సంచలనం కలిగించిన ట్యాంకర్ కుంభకోణంలో విచారణ అలస్యం చేస్తున్న కారణాన్ని ప్రశ్నించినందునే తనను తొలగించారని ఆయన ఆరోపించారు.
నేడో బాంబు పేలుతుందని, సంచలనం కలిగించే నిజాలను తాను ప్రజల ముందు ఉంచనున్నానని హెచ్చరించారు. సీఎం కేజ్రీవాల్ ను కలిసి ట్యాంకర్ స్కామ్ పై చర్చించిన తరువాతనే తనకు ఉద్వాసన పలికారని అన్నారు. ఇప్పటికైనా కేజ్రీవాల్ పరిపాలనపై దృష్టిని సారించి, కుమార్ విశ్వాస్ వంటి వ్యక్తికి ఆప్ జాతీయ కన్వీనర్ పదవిని అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓక్లా ఎంఎల్ఏ అమానతుల్లా ఖాన్ ను పార్టీ నుంచి తొలగించాలని అన్నారు.