: అమ్మ పడిన బాధ మరెవరికీ రాకూడదని.. రొమ్ము కేన్సర్‌ను గుర్తించే బ్రాను రూపొందించిన యువకుడు!
రొమ్ము కేన్సర్‌తో తన తల్లి అనుభవించిన బాధ మరే మహిళకు రాకూడదనే ఉద్దేశంతో 18 ఏళ్ల కుర్రాడు రూపొందించిన బ్రా ప్రశంసలు అందుకుంటోంది. రొమ్ము కేన్సర్ వచ్చే లక్షణాలను ముందుగానే ఈ బ్రా పసిగడుతుంది. ఇందుకోసం బ్రాలో దాదాపు 200 వరకు సెన్సర్లను ఉపయోగించాడు. దీనిని రోజూ ధరించాల్సిన అవసరం కూడా లేదు. వారానికి ఓ గంట ధరిస్తే సరిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఈ బ్రా శరీరంలోని రక్త సరఫరాలో తేడాలను గుర్తించడం ద్వారా కేన్సర్ లక్షణాలను పసిగట్టి హెచ్చరిస్తుంది. అమెరికాలోని హ్యూస్టన్‌కు చెందిన జిలియన్ రియోస్ కంటూ తల్లి రొమ్ము కేన్సర్ బారినపడి చాలా వేదన అనుభవించారు. చివరికి రొమ్ములను తొలగించుకోవాల్సి వచ్చింది. తల్లి పరిస్థితి చూసి కలత చెందిన కంటూ తన తల్లి పడిన బాధ మరెవరూ పడకూడదనే ఉద్దేశంతో విస్తృత పరిశోధనలు చేసి కేన్సర్‌ను ముందుగానే గుర్తించే ఈ బ్రాను రూపొందించాడు.