: పొరపాటున ఓ ఫోన్ నంబర్ ను ట్వీట్ చేసిన మిచెల్ ఒబామా... కంగారుపడ్డ అభిమానులు!


సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో దాదాపు 76 లక్షల మంది ఫాలోయర్లను కలిగున్న యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ చేసిన ఓ ట్వీట్ దుమారం రేపింది. వైట్ హౌస్ లో గతంలో క్రియేటివ్‌ డిజిటల్‌ స్ట్రాటజిస్ట్‌ గా పనిచేసిన డంకన్‌ వోల్ఫ్‌ ఫోన్ నెంబర్‌ ను ఆమె పొరపాటున ట్వీట్ చేశారు. ఆమె నుంచి ట్వీట్ రావడంతో, ఏదో కారణంతోనే ఆమె ట్వీట్ చేశారని భావిస్తూ, లక్షలాది మంది ఆ నంబరుకు కాల్ చేయడం మొదలు పెట్టగా, ఆపై తప్పు తెలుసుకున్న మిచెల్, దాన్ని డిలీట్ చేశారు. ఆ ఫోన్ పని చేయడం లేదని తెలుసుకున్న మిచెల్ అభిమానులు, ఆమె ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసుంటారన్న అనుమానాలనూ వ్యక్తం చేశారు. దీనిపై మిచెల్ స్పందిస్తూ, తన ట్విట్టర్ ఖాతాను ఎవరూ హ్యాక్ చేయలేదని, తానే పొరపాటున ట్వీట్ పెట్టానని, ఆపై తప్పును సరిదిద్దుకున్నానని వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News