: రిలయన్స్ కు సెబీ 11 కోట్ల జరిమానా
దేశీయ కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీపై సెబీ కొరడా ఝుళిపించింది. రిలయన్స్ కు చెందిన రిలయన్స్ పెట్రో ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్, ఐపిసిఎల్ లో ఇన్ సైడర్ ట్రైడింగ్ కు పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంది. ఐపిసిఎల్ తర్వాత రిలయన్స్ లో విలీనం అయింది. విలీనం సంగతి ముందుగా తెలిసే ఐపిసిఎల్ లో వాటాలను కొనుగోలు చేసిందని సెబీ నిర్ధారించి రిలయన్స్ పై 11 కోట్ల రూపాయల జరిమానా విధించింది.