: కొత్త పార్టీ గురించి శివపాల్ అసలు నాతో చెప్పనేలేదు: ములాయం సింగ్


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ‘సమాజ్‌వాదీ సెక్యులర్‌ మోర్చా’ పేరిట కొత్త పార్టీని ప్రారంభిస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర నేత‌ శివపాల్‌ యాదవ్ నిన్న ఓ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఆ పార్టీకి త‌న సోద‌రుడు ములాయం సింగ్ యాద‌వ్‌ అధ్యక్షుడిగా ఉంటారని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే, ఈ అంశంపై స్పందించిన ములాయం సింగ్ యాద‌వ్ కొత్త పార్టీ గురించి అస‌లు శివపాల్‌ తనతో చర్చించలేదని అన్నారు. ఈ విష‌యంపై తాను శివ‌పాల్‌తో త్వ‌ర‌లోనే మాట్లాడతానని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీలో చీలిక‌లు రావాల‌ని మాత్రం తాను కోరుకోవడం లేదని అన్నారు. ఏడు రోజులుగా తనను శివ‌పాల్ కలవలేదని, ఇప్పటికీ కొత్త పార్టీ గురించి తనతో మాట్లాడ‌లేద‌ని అన్నారు.

  • Loading...

More Telugu News