: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్న టీమిండియా


ఇంగ్లండ్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో మన దేశం ఆడుతుందో లేదో అనే సస్పెన్స్ కు తెరపడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడుతుందని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా తెలిపారు. సోమవారం నాడు జట్టును ఎంపిక చేస్తారని చెప్పారు. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ తో టీమ్ ఎంపీకపై సమీక్ష జరుపుతున్నట్టు తెలిపారు. మరోవైపు, టోర్నీ నుంచి తప్పుకునే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని బీసీసీఐ సభ్యుడొకరు తెలిపారు. రేపు బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

  • Loading...

More Telugu News