: 'బాహుబలి-2'లో తమన్నా తక్కువగా కనపడటానికి కారణం ఇదే!


'బాహుబలి' సినిమాలో కీలకమైన సన్నివేశాల్లో కనిపించిన మిల్కీ బ్యూటీ తమన్నా... 'బాహుబలి-2'లో మాత్రం కొన్ని షాట్స్ కే పరిమితమైంది. వాస్తవానికి రెండో భాగంలో కూడా తాను చాలా సీన్స్ లో కనిపిస్తానని ప్రమోషన్ కార్యక్రమాల్లో తమన్నా చెప్పింది. కానీ, ఆమె చెప్పినట్టు కాకుండా రెండు, మూడు షాట్స్ కే పరిమితమైంది. ఇంకా చెప్పాలంటే ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు.

వాస్తవానికి కొన్ని పోరాట సన్నివేశాలను తమన్నాతో దర్శకుడు రాజమౌళి చిత్రీకరించాడట. అయితే, ఈ సీన్లకు సంబంధించి గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో రాలేదట. దీంతో, క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గకూడదని భావించిన రాజమౌళి... ఆ సీన్స్ ను కట్ చేసేశాడట. దీంతో, రెండో భాగంలో తమన్నా క్యారెక్టర్ ఎక్కువ కనిపించకుండా పోయింది.

  • Loading...

More Telugu News