: మీరు కాఫీ ప్రియులా... అయితే, ఈ శుభవార్త మీకే!


ఉద‌యం లేవ‌గానే కాఫీ తాగ‌నిదే కొంద‌రికి ఏ ప‌నీ చేయాల‌నిపించ‌దు. దాని రుచికి అంత‌గా అల‌వాటు ప‌డిపోతుంటారు. కాఫీ తాగితే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటార‌ని ఇప్ప‌టికే ప‌లు ప‌రిశోధ‌న‌లు తెలిపాయి. రోజుకి మోతాదు మించకుండా కాఫీ తాగితే గుండె జబ్బులతో మరణించే ప్రమాదం కూడా 21 శాతం తగ్గిపోతుందని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఇన్ఫర్‌మేషన్‌ ఆన్‌ కాఫీ(ఐఎస్ఐసీ) చేసిన ఓ అధ్య‌య‌నం ద్వారా తెలిసింది. ప్ర‌తి రోజు మూడు నుంచి ఐదు కప్పుల కాఫీని తాగ‌డం ద్వారా ఈ ప్రయోజనం చేకూరుతుంది. కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీ తాగేవారికి టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం సైతం సుమారు 25 శాతం తగ్గుతుందట.
 
గుండె జ‌బ్బుల‌పై చేసిన మ‌రో ప‌రిశోధ‌న‌లో నిత్యం రద్దీగా ఉండే రహదారులకు సమీపంలో నివసించే వారికి ఆ జబ్బులు వచ్చే ప్రమాదం అధిక‌మ‌ని తెలిసింది. అక్క‌డి వాహనాల శబ్దాలు, కాలుష్యంతో ఆ ప‌రిస‌రాల్లో నివ‌సించే వారు ఇత‌రుల‌తో పోల్చితే తక్కువ కాలం బ‌తుకుతున్నార‌ని తేలింది.

  • Loading...

More Telugu News