: గ్యాస్ లీక్.. 60 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత


దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కంటెయినర్ లోని గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 60 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులతో పాటు, అంబులెన్స్ లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అస్వస్థతకు గురైన వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ కారణంగా కళ్లల్లో, గొంతులో మంట రావడం, ఊపిరి తీసుకోవడం కష్టమవడం వంటి ఇబ్బందులకు విద్యార్థులు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులంతా రాణి ఝాన్సీ సర్వోదయ కన్యా విద్యాలయ స్కూల్ కు చెందినవారు. 

  • Loading...

More Telugu News