: రండి జనసేనలోకి ఇదే ఆహ్వానం...: ఉత్తరాంధ్ర, హైదరాబాదీలకు పవన్ కల్యాణ్ పిలుపు


నేటి నుంచి గ్రేటర్ హైదరాబాదు, ఉత్తరాంధ్ర జనసేన సైనికుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాదు, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జనసేన పార్టీ కార్యకర్తల కోసం ఎదురు చూస్తోందని, ఈ నేపథ్యంలో పార్టీ కోసం పని చేయాలనుకునేవారికి ఆహ్వానం పలుకుతోందని, నేటి నుంచి ఈ నెల 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని జనసేన తెలిపింది. రాజకీయ ప్రక్రియలో నవతరాన్ని ఆహ్వానించాలన్న ఆలోచనతో తామీ కార్యాచరణకు పూనుకున్నామని చెప్పారు. కంటెంట్ రైటర్లు, స్పీకర్ల కోసం ఈ తరహా ఎంపిక చేపట్టామని ఆయన అన్నారు. దీనిని పరీక్షగా భావించవద్దని పవన్ ఆ ప్రకటనలో కోరారు. 

  • Loading...

More Telugu News