: ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధమంటూ.. కీలక బిల్లును తిరస్కరించిన పాక్ జాతీయ అసెంబ్లీ
దాయాది దేశం పాకిస్థాన్ లో బాల్య వివాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలికల వివాహ వయసును 16 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు పెంచాలంటూ అక్కడి న్యాయనిపుణులు ఓ బిల్లును రూపొందించారు. అయితే వివాహ వయసును పెంచేందుకు పాక్ జాతీయ అసెంబ్లీ నిరాకరించింది. బిల్లును తిరస్కరించింది. బాలికల వయసును పెంచుతూ తీసుకు వచ్చిన బిల్లు ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధంగా ఉందని పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడ్డారు. వీరిలో హిందూ, క్రిస్టియన్ పార్లమెంటు సభ్యులు కూడా ఉండటం కొసమెరుపు.