: భారతీయ దంపతులను కాల్చి చంపిన అమెరికన్


అమెరికాలో మరో దారుణం చోటుచేసుకుంది. భారతీయ దంపతులను వారి కుమార్తె మాజీ ప్రియుడే కాల్చి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.... అమెరికాలోని కాలిఫోర్నియాలో గల జానీపుర్ నెట్ వర్క్స్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ గా సురేష్ ప్రభు అనే భారత సంతతి వ్యక్తి పని చేస్తున్నారు. ఆయన కుమార్తె రాచెల్ అమెరికాకు చెందిన మీర్జా తాత్లిక్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే ఆయనతో విభేదాలు రావడంతో 2016లో వారు విడిపోయారు. అప్పటి నుంచి ఆమెపై వేధింపులకు దిగుతున్న మీర్జా తాత్లిక్... గత రాత్రి సురేష్ ప్రభు నివాసంలో చొరబడ్డాడు.

సురేష్ ప్రభు, అతని భార్యను ఒక గదిలో నిర్బంధించాడు. దీనిని గుర్తించిన మరో కుమారుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు తాత్లిక్ ను లొంగిపోవాలని హెచ్చరించారు. అతను లొంగకపోవడంతో లోపలికి ప్రవేశించిన పోలీసులకు, మొదటి గదిలో సురేష్ ప్రభు, అతని భార్య కాల్చివేయబడి ఉండడం కనిపించింది. దీంతో తాత్లిక్ ను కాల్చి చంపారు.

  • Loading...

More Telugu News