: చైనాలో దూసుకుపోతున్న 'దంగల్'


మన బాక్సాఫీసును షేక్ చేసిన అమీర్ ఖార్ సినిమా 'దంగల్' చైనాలో సైతం దుమ్ము రేపుతోంది. నిన్న అక్కడ విడుదలైన 'దంగల్' తొలిరోజే రూ. 15 కోట్లు వసూలు చేసింది. అమీర్ కు చైనాలో మంచి ఆదరణ ఉంది. అమీర్ నటించిన 'పీకే' సినిమా చైనాలో రూ. 100 కోట్లు వసూలు చేసింది. '3 ఇడియట్స్' సినిమాను చైనీస్ లోకి డబ్ చేసి, విడుదల చేసినప్పటి నుంచి చైనా సినీ అభిమానులకు అమీర్ ఖాన్ దగ్గరయ్యాడు. 'దంగల్' సినిమా ప్రమోషన్ కోసం బీజింగ్, షాంఘై, చాంగ్డు నగరాల్లో అమీర్ పర్యటించాడు. మరోవైపు చైనా కూడా అక్కడ ప్రదర్శించే భారతీయ సినిమాల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచింది. 

  • Loading...

More Telugu News