: ఏపీలో వీఐపీ వాహనాలపై ఎర్రబుగ్గలు బంద్..జీవో జారీ


ఏపీలో వీఐపీ వాహనాలపై ఎర్రబుగ్గల వినియోగాన్ని నిషేధించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అంబులెన్స్ లు, పోలీసు వాహనాలు మినహా ఇతర వాహనాలకు ఎర్రబుగ్గలు ఉండరాదని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. కాగా, వీఐపీ సంస్కృతికి స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతో అధికారిక వాహనాలపై ఎర్రబుగ్గలను నిషేధిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చింది.

  • Loading...

More Telugu News