: రైల్వేస్టేషన్ లో 20 కేజీల బంగారం స్వాధీనం


అసోం లోని గుహవాటి రైల్వేస్టేషన్‌లో ఈ రోజు రైల్వే పోలీసులు న‌లుగురు వ్య‌క్తుల నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న గురించి రైల్వే పోలీసులు వివ‌రిస్తూ... సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగా నలుగురు వ్యక్తుల వ‌స్తువులు త‌నిఖీ చేయ‌గా వారివ‌ద్ద ఏకంగా 20 కేజీల బంగారం ప‌ట్టుబ‌డింద‌ని తెలిపారు. ఈ మొత్తం బంగారం విలువ రూ.8 కోట్లు ఉంటుందని చెప్పారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ న‌లుగురు వ్యక్తులను అరెస్టు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

  • Loading...

More Telugu News