: ఆశా వర్కర్ల వేతనం రూ.6 వేలకు పెంపు.. సీఎం కేసీఆర్ ప్రకటన


ఆశా వర్కర్ల వేతనం రూ.6 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఆశావర్కర్లు, ఏఎన్ఎంలతో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, వచ్చే బడ్జెట్ తర్వాత మళ్లీ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. భవిష్యత్ లో అంగన్ వాడీల స్థాయిలో ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. త్వరలో పన్నెండు వందల ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేస్తామని, ఈ పోస్టుల భర్తీలో ఆశావర్కర్లకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఆశా వర్కర్లకు ఆరోగ్య సంబంధ పనులు మినహా ఇతర పనులు పెట్టొద్దని ఈ సందర్భంగా సంబంధిత అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News