: ఈ తీర్పుతో మానవహక్కులు హత్యకు గురయ్యాయి.. ‘నిర్భయ’ డిఫెన్స్ లాయర్ సంచలన వ్యాఖ్యలు


‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులకు కింది కోర్టులు విధించిన మరణశిక్షే సరైందని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తాజా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ తీర్పు వెలువడిన అనంతరం కోర్టు బయట ‘నిర్భయ’ డిఫెన్స్ లాయర్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు జాతిపిత మహాత్మా గాంధీ ప్రబోధ అహింసా సిద్ధాంతానికి విరుద్ధమని, సమాజానికి ఏదో సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో కోర్టులు ఉరిశిక్షలు వేయడం సరికాదని, ఈ తీర్పుతో మానవహక్కులు హత్యకు గురయ్యాయని విమర్శించారు. ఈ తీర్పుతో తమకు న్యాయం జరగలేదని, రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఏపీ సింగ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News