: జయహో ఇస్రో... జీశాట్-9 ప్రయోగం విజయవంతం... దక్షిణాసియాకు మోదీ కానుక
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి ఈ రోజు ఇస్రో చేసిన జీశాట్-9 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. జీఎస్ఎల్వీ-ఎఫ్09 ద్వారా నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-9 నిర్ణీత కక్ష్యలో ప్రవేశించినట్లు ఇస్రో తెలిపింది. ఇస్రో సాధించిన ఈ తాజా విజయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో మరో చారిత్రాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని ఆయన అన్నారు. కాసేపట్లో మోదీ దక్షిణాసియా అగ్రనేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ ఉపగ్రహం పాకిస్థాన్ మినహా సార్క్ దేశాల సమాచార వ్యవస్థకు ఉపయోగపడనున్న విషయం తెలిసిందే. ఈ ఉపగ్రహం బరువు 2230 కిలోలు.