: 'బాహుబలి' టీవీ సిరీస్ కూడా వచ్చేస్తోంది


ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించి, భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసిన 'బాహుబలి' ఇకపై టీవీ ప్రేక్షకులను కూడా అలరించనుంది. టీవీ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఈ సిరీస్ తొలుత హిందీలో రూపొందనుంది. ఆ తర్వాత దీన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తారు. అయితే రెండు భాగాలలో ఉన్న కథ కాకుండా... రైజ్ ఆఫ్ శివగామి కాని, బాహుబలి-2 తర్వాతి పరిణామాల నేపథ్యంలో గాని ఇది రూపొందనుంది. మొత్తంమీద 10 నుంచి 13 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను రూపొందించనున్నారు. 

  • Loading...

More Telugu News