: పావని, ప్రదీప్ మధ్య సఖ్యత లేదు...ప్రదీప్ పార్టీ మధ్యలో బయటకు వెళ్లడం వల్లే వివాదం వచ్చింది: పోలీసులు


టీవీ యాక్టర్ ప్రదీప్ ఆత్మహత్య మిస్టరీని ఛేదించేందుకు విచారణ ప్రారంభించామని అన్నారు. భార్యాభర్తల మధ్య ఉండే సాధారణ వివాదాలే వారి మధ్య కూడా ఉన్నాయని వారు తెలిపారు. పావని, ప్రదీప్ మధ్య సఖ్యత లేదని అర్థమైందని వారు చెప్పారు. పార్టీ మధ్యలో ప్రదీప్ బయటకు వెళ్లి రావడంతో వివాదం ముదిరిందని వారు చెప్పారు. బయటకు చెప్పకుండా వెళ్లడంతో ఎక్కడికి వెళ్లావంటూ పావని నిలదీసిందని, దీంతోనే ప్రదీప్ గోడకు ఉన్న అద్దాన్ని పగులగొట్టాడని వారు చెప్పారు.

దీనిని మద్యం మత్తులో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నామని వారు తెలిపారు. వైజాగ్ కు చెందిన శ్రావణ్ వారిద్దరికీ ఆత్మీయుడని అన్నారు. శ్రావణ్ ఖతార్ లో ఒక ఎమ్మెన్సీలో పని చేసేవాడని, ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేందుకు హైదరాబాదు వచ్చేశాడని, అందులో ప్రదీప్ ను భాగస్వామిని చేసేందుకు నిర్ణయించుకున్నాడని వారు చెప్పారు. వారిద్దరూ మంచి స్నేహితులు కావడంతోనే శ్రావణ్ అక్కడున్నాడని వారు స్పష్టం చేశారు. విచారణలో మరిన్ని వివరాలు తెలుసుకుంటామని వారు చెప్పారు. 

  • Loading...

More Telugu News