: కొత్త బార్లకు తలుపులు బార్లా... మరో 145 బార్ల ఏర్పాటుకు టీఎస్ నోటిఫికేషన్
సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా మరో 145 బార్లను వివిధ నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు కొత్త నిబంధనల ప్రకారం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, అందుకు ఎటువంటి ఫీజూ ఉండదని స్పష్టం చేస్తూ, తుది గడువైన 10వ తేదీలోగా దరఖాస్తులు అందాలని పేర్కొంది.
కాగా, తెలంగాణలో ఇప్పటికే 854 బార్లు ఉండగా, జనాభా పెరుగుదల, పట్టణీకరణ ఆధారంగా, సర్వే చేసిన ఎక్సైజ్ శాఖ, హైదరాబాద్ సహా వరంగల్, నిజామాబాద్, ఖమ్మం తదితర పట్టణాలు, వివిధ నగర పంచాయితీల్లో కొత్త బార్లను ఏర్పాటు చేయవచ్చని తెలిపింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో జాతీయ రహదారుల నుంచి 220 మీటర్ల దూరంలో, ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 500 మీటర్ల దూరంలో కొత్త బార్లు ఉండాల్సి వుంటుంది.