: బాహుబలి 2 చూపించండి.. చాలు!: పూణె ఫిలిం ఇన్స్టిట్యూట్ కు రామ్ గోపాల్ వర్మ సూచన


నటులు కావాలన్న కోరికతో ఎంతో మంది ఫిలిం ఇన్స్టిట్యూట్ లలో చేరుతుండటం తెలిసిందే. ఇలాంటి వారందరికీ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సూచన చేశాడు. లక్షలు తగలేసి ఫిలిం ఇన్స్టిట్యూట్ లలో చేరడం శుద్ధ దండగ అని చెప్పాడు. ఒక రూ. 200 ఖర్చు పెట్టి, రెండు గంటల సేపు 'బాహుబలి-2' సినిమా చూస్తే... 2వేల రెట్లు ఎక్కువగా నేర్చుకోవచ్చని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇదే సమయంలో ప్రఖ్యాతిగాంచిన పూణె ఫిలిం ఇన్స్టిట్యూట్ కు కూడా వర్మ ఓ సూచన చేశాడు. ఇప్పటిదాకా మీరు నేర్పిస్తున్నదంతా పక్కన పడేసి... 'బాహుబలి-2' సినిమాను మాత్రమే ఏకైక కోర్సుగా అందించాలని సూచించాడు.

  • Loading...

More Telugu News