: ప్రకాశం జిల్లా రామదూత ఆశ్రమానికి వచ్చి వ్రత దీక్ష చేపట్టిన నితిన్ గడ్కరీ


ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు మండలం చేవూరులో ఉన్న రామదూత ఆశ్రమానికి సతీ సమేతంగా వచ్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్రత దీక్ష చేపట్టారు. ఇక్కడ సువర్ణ దత్త లక్ష్మీ దాంపత్య వ్రతాలు జరుగుతుండగా, మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కలసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గడ్కరీ దంపతులకు స్వాగతం పలికిన ఆశ్రమం ప్రతినిధులు దగ్గరుండి వ్రతాన్ని చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా హాజరయ్యారు. బీజేపీ నేతల రాకతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News