: అల్లు రామలింగయ్యకు ఆల్టర్ నేటివ్ లేదు: దర్శకుడు దాసరి


తాను గొంతు తెరిచి నాలుగు మాసాలు అయిందని, గొంతు సరిగా లేదని, పది రోజుల క్రితమే గొంతు వచ్చిందని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని ఈ రోజు దాసరికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీడియా మాట్లాడమని చాలా రోజుల నుంచి అడుగుతున్నా ఇప్పుడే వద్దని, నెల రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానని చెప్పానని అన్నారు.

కానీ, ఈ సందర్భం తాను ఊహించలేదని, ఈ అవార్డును వేదికపై తీసుకోవాల్సిందని, కానీ, అనారోగ్యం కారణంగా కుదరలేదన్నారు. ఆ అవార్డును తన తరపున చిరంజీవి అందుకుని, ఈ రోజున, తన పుట్టిన రోజు సందర్భంగా దీనిని తనకు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. జీవితంలో ఎన్నో రకాల అవార్డులు పొందానని, కానీ, ఈ అవార్డుకు ఓ ప్రత్యేక ఉందని అన్నారు. ఎందుకంటే, ఈ అవార్డు తన సొంత మనుషులు ఇచ్చే అవార్డని అన్నారు. అల్లు రామలింగయ్యకు, తనకు ఉన్న అనుబంధం అందరికీ తెలుసని, దాదాపు తాను తీసిన అన్ని సినిమాల్లోను నటించిన నటుడు అల్లు రామలింగయ్య అని, ఆయనకు ఆల్టర్ నేటివ్ లేదని దాసరి ప్రశంసించారు. 

  • Loading...

More Telugu News