: పాక్ పై ప్రతీకారం తప్పదు.. ఏం చేస్తామో ఇప్పుడు చెప్పబోం: భారత సైన్యాధ్యక్షుడు


స‌రిహ‌ద్దు వ‌ద్ద దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న పాక్‌పై చర్యలు తీసుకున్న తర్వాతే ఆ వివరాలను బహిర్గతం చేస్తామని భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్ తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు భార‌త‌ జవాన్లను చంపేసి, అనంత‌రం వారి త‌ల‌లు న‌రికేసిన పాక్ రేంజ‌ర్ల చ‌ర్య‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఈ రోజు భారత సరిహద్దు ప్రాంతాలను పరిశీలించి, మీడియాతో మాట్లాడిన భార‌త సైన్యాధ్య‌క్షుడు.. పాకిస్థాన్‌ సైన్యంపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పారు.

మ‌రోవైపు ఆర్మీ అధికారి శరత్‌చంద్ ఇదే అంశంపై మాట్లాడుతూ భార‌త సైన్యం ఎప్పుడు, ఎక్కడ ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టి సారించింద‌ని చెప్పారు. భార‌త జ‌వాన్ల త‌లలు న‌రికిన విష‌యంలో పాక్‌ సైన్యం తాము ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ‌లేద‌న్న‌ట్లు మాట్లాడుతోంద‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News