: జగన్ అక్రమాస్తుల కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈ రోజు ఈడీ మరో ఛార్జిషీటు దాఖలు చేసింది. జగన్మోహన్ రెడ్డి, విజయ్ సాయిరెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డిలను నిందితులుగా పేర్కొంటూ పెన్నా సిమెంట్ వ్యవహారంలో ఈడీ కోర్టులో అభియోగపత్రం దాఖలైంది. వీరంతా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అభియోగంలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈడీ జగన్, విజయ్ సాయిరెడ్డిలపై పలు ఛార్జిషీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.