: దాసరి ఇంటికి వెళ్లిన చిరంజీవి, మోహన్ బాబు, అల్లు అరవింద్
ఈ రోజు ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు జన్మదినం. దీంతో ఈ రోజు ఉదయం నుంచి ఆయన ఇంటికి సినీ ప్రముఖులు చేరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి, నటుడు మోహన్‌బాబు, నిర్మాత అల్లు అరవింద్ వచ్చారు. దాసరి నారాయణ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు వారు అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం అందజేసి, సత్కరించారు. దాసరితో చిరంజీవి, మోహన్‌బాబు, అల్లు అరవింద్ కాసేపు ముచ్చటించారు.