: గూగుల్ పిక్సల్, పిక్సల్ ఎక్స్‌ఎల్ ఫోన్లపై రూ.13వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్
ప్రముఖ సంస్థ గూగుల్... తమ గూగుల్ పిక్సల్, పిక్సల్ ఎక్స్‌ఎల్ ఫోన్ లపై భారీ ఆఫర్‌ను ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తోంది. గూగుల్ పిక్సల్ 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57 వేలు, కాగా... 128 జీబీ వేరియంట్ రూ.66 వేలుగా ఉంది. గూగుల్ పిక్సల్ ఎక్స్‌ఎల్ 32 జీబీ వేరియంట్ రూ.67వేలు, కాగా.. 128 జీబీ వేరియంట్ ధర రూ.76వేలుగా ఉంది. అయితే, ఈ ఫోన్‌లపై ఏకంగా 13 వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు జరిపితే కొన్న కొన్ని రోజులకే క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నామని, నగదుతో చెల్లింపులు జరిపినవారికి కూడా వెంటనే రూ.13 వేలను తగ్గిస్తామని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా గూగుల్ పిక్సల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఒక కార్డుపై ఒకసారి మాత్రమే ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు చెప్పింది. ఈ నెల 31 వరకు ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.