: ఆలయాల చుట్టూ తిరుగుతున్నాననే మాటలు బాధించాయి: గవర్నర్ నరసింహన్
తాను ఎక్కువగా ఆలయాల చుట్టూ తిరుగుతున్నాననే మాటలు తనను బాగా బాధించాయని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ప్రజల సంక్షేమంపై రెండు తెలుగు ప్రభుత్వాలు దృష్టి పెట్టడం ఆనందంగా ఉంది. అభివృద్ధిలో రెండు ప్రభుత్వాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఇద్దరు సీఎంలు అటూఇటూ పర్యటించాలన్నది నా భవిష్యత్ స్వప్నం.. నేను, ఎప్పటికైనా చెన్నైకి వెళ్లిపోతాను’ అని నరసింహన్ అన్నారు.