: 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన వాట్సప్!
ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సప్‌ను ఎంతగా వాడుతున్నారో అందరికీ తెలిసిందే. అయితే, గత అర్ధరాత్రి తరువాత వాట్సప్ సుమారు 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయింది. భారత కాలమానం ప్రకారం గత రాత్రి 1.40 నుంచి 2.30 వరకు ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో వాట్సప్ పనిచేయకపోవడంతో కోట్లాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో వాట్సప్ సంస్థ సకాలంలో స్పందించి, ఆ యాప్‌లో ఏర్పడ్డ సమస్యను పరిష్కరించింది. అనంతరం తమ యూజర్లకు క్షమాపణలు చెప్పింది. పలు దేశాల్లో వాట్సప్ సేవలు పూర్తిగా నిలిచిపోగా, కొన్ని దేశాల్లో కనెక్షన్ సమస్యలు వచ్చాయి. మరికొన్ని దేశాల్లో మెల్లిగా పనిచేసింది.