: 15 ఏళ్ల క్రితం వచ్చిన ‘షో’ సినిమాకి సీక్వెల్ గా ‘సెకండ్ షో’ !
సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు మంజుల, నటుడు సూర్య ప్రధాన పాత్రల్లో 15 ఏళ్ల క్రితం వచ్చిన షో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకొని జాతీయ అవార్డును కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాతగా మంజుల వ్యవహరించగా, దర్శకత్వ బాధ్యతలను నీలకంఠ నిర్వర్తించాడు. ఈ సినిమాతో నీలకంఠకు మంచి పేరు వచ్చింది. అనంతరం ఆయన భూమిక ప్రధానపాత్ర పోషించిన మిస్సమ్మ సినిమాను తీసి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే, అనంతరం ఆయన తీసిన సినిమాలు అంతగా ఆడలేదు. కొంత గ్యాప్ తరువాత ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన 'షో' సినిమాకు సీక్వెల్ గా 'సెకండ్ షో' పేరిట ఓ చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమా పని మీదనే ఆయన పలువురితో చర్చలు జరుపుతూ బిజీబిజీగా ఉన్నాడు.