: హైదరాబాద్ లో నటుడు ప్రదీప్ అంత్యక్రియలు పూర్తి
ప్రముఖ నటుడు ప్రదీప్ హైదరాబాద్ నార్సింగ్ లోని అలకాపురి కాలనీ గ్రీన్ హోమ్స్ లోని అపార్ట్ మెంట్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో నిర్వహించారు. చెన్నైలో ఉంటున్న ప్రదీప్ తల్లి హైదరాబాద్‌కు చేరుకొని తన కొడుకు మృతదేహం వద్ద బోరున విలపించింది. ఈ కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రదీప్‌ది ఆత్మహత్యేనని పోలీసులు ఇప్పటికే నిర్ధారించిన విషయం తెలిసిందే. అయితే, అందుకు దారితీసిన పరిస్థితులపై వారు ఆరా తీస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని పోలీసులు తెలిపారు.