: ప్రదీప్ ది ఆత్మహత్యే... పోస్టుమార్టం నివేదిక!
టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఉస్మానియా వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. అతని చేతికైన గాయం కారణంగానే శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయని, ఆ గాయం ప్రాణాలను తీసేంత పెద్దది కాదని, మెడకు వేసుకున్న ఉరే అతని ప్రాణాలు తీసిందని వైద్యులు తమ రిపోర్టులో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ప్రదీప్ మృతదేహానికి ఈ ఉదయం పోస్టుమార్టం చేసిన వైద్యులు, తాము గమనించిన ఈ విషయాన్ని పోలీసు అధికారులకు తెలిపినట్టు సమాచారం. ఈ నివేదిక వచ్చిన తరువాత విచారణను వేగవంతం చేస్తామని పోలీసులు చెప్పిన సంగతి విదితమే. ఇక ఈ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏంటనే విషయమై పోలీసుల దర్యాఫ్తు సాగనుంది.