: ఇండియాలో టాప్ టెన్ క్లీన్ సిటీలు ఇవిగో!
దేశంలోని స్వచ్ఛ నగరాల జాబితాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. 'స్వచ్ఛ సువేక్షణ 2017'లో భాగంగా ఈ జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ గుజరాత్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోని నగరాలు బాగా మెరుగుపడ్డాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి బాగోలేదని... పెద్ద రాష్ట్రం కావడం, ఎక్కువ సమస్యలు ఉండటంతో అక్కడ ఆశించిన ఫలితాలు రాలేదని చెప్పారు. తామంతా రేపు యూపీకి వెళుతున్నామని... మెరుగైన పరిస్థితులను తీసుకురావడానికి ఏం చేయాలో ఓ ప్రణాళికను తయారు చేస్తామని తెలిపారు.
మన దేశంలో టాప్ టెన్ క్లీన్ సిటీలు ఇవే...
- ఇండోర్ (మధ్యప్రదేశ్)
- భోపాల్ (మధ్యప్రదేశ్)
- విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
- సూరత్ (గుజరాత్)
- మైసూరు (కర్ణాటక)
- తిరుచురాపల్లి (తమిళనాడు)
- న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్
- కొత్త ముంబై (మహారాష్ట్ర)
- తిరుపతి (ఆంధ్రప్రదేశ్)
- వడోదర (గుజరాత్)