: ఏడాది తరువాత అతిపెద్ద ఆపరేషన్... జమ్మా కాశ్మీర్ లో ఉగ్రవాదులపై భారీ ఎత్తున విరుచుకుపడుతున్న సైన్యం


కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, దాడులకు పాల్పడుతున్నారని వరుసగా వీడియోలు విడుదలవుతుండటంతో భద్రతా దళాలు భారీ ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్ ను ప్రారంభించాయి. గడచిన సంవత్సర కాలంలో ఎన్నడూ లేనంత పెద్ద ఆపరేషన్ కు దిగాయి. హిజ్బల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం పరిస్థితులు విషమించగా, కాశ్మీర్ ముస్లిం యువత రాళ్ల దాడులకు దిగుతుండటం, పోలీసుల కాల్పుల్లో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంతో, కేంద్రం ఆదేశాల మేరకు తమ సెక్యూరిటీ ఆపరేషన్స్ నిలిపివేసిన సైన్యం, తిరిగి ఇప్పుడు ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా కదిలింది.

ఏకంగా 3 వేల మందికి పైగా సైన్యం, సీఆర్పీఎఫ్ దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ ఉదయం నుంచి పన్నెండు గ్రామాలు, అడవులను జల్లెడ పతుతున్నారు. గత కొంతకాలంగా సోపియాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆయుధాలు ధరించి సంచరిస్తున్న వీడియోలు బహిర్గతమైన సంగతి తెలిసిందే. దాదాపు 100 మంది వరకూ స్థానిక యువకులు సైతం ఉగ్రవాదుల్లో చేరిపోయారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సైనికులపై దాడులు పెరగడం, ఆయుధాలు ఎత్తుకు పోతున్న ఘటనలతో అప్రమత్తమైన సైన్యం, కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ముందుకు కదిలినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News