: పఠాన్ కోట్ సైనిక స్థావరంలో మళ్లీ కలకలం!


పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిని మర్చిపోకముందే... అక్కడి సైనిక స్థావరంలో మరోసారి కలకలం చెలరేగింది. ముగ్గురు వ్యక్తులు ఈ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో... నిన్నటి నుంచి పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. దీనికి తోడు, మమున్ ఆర్మీ కంటోన్మెంట్ వద్ద తనిఖీల్లో గుర్తు తెలియని వ్యక్తికి సంబంధించిన ఓ బ్యాగ్ లభించింది. ఈ బ్యాగులో రెండు మొబైల్ టవర్ బ్యాటరీలను గుర్తించారు. దీంతో, ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఈ నేపథ్యంలో, పఠాన్ కోట్, గురుదాస్ పూర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News