: 'ఆనాడు సీఎంను ఎలా చంపామో తెలుసుగా?... నీ గతీ అంతే'నంటూ అమరీందర్ కు ఖలిస్తాన్ ఆడియో హెచ్చరిక!


"కెప్టెన్! మీ పార్టీకి చెందిన బియాంత్ సింగ్ అనే ముఖ్యమంత్రి ఉండేవారు తెలుసుగా? అతని అంత్యక్రియలను నిర్వహించుకోవడానికి మృతదేహం ముక్కలను ఏరుకోవాల్సి వచ్చింది. నీ గతి కూడా అంతే" అంటూ ఒకటి కాదు, రెండు కాదు, వరుస బెట్టి పలు ఆడియో మెసేజ్ లను ఖలిస్తాన్ ఉగ్రవాదులు కెనడా నుంచి పంజాబ్ కెప్టెన్ అమరీందర్ కు పంపుతున్నారు. తమ రక్షణ మంత్రిని ఉగ్రవాది అని వ్యాఖ్యానించారని, దమ్ముంటే కెనడా రావాలని హెచ్చరించారు.

గతంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు అప్పటి ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ ను కారుబాంబుతో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉగ్రవాదులు అమరీందర్ తో పాటు రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసిన మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ నూ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఇండియాలో పర్యటించిన కెనడా రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్ పేరు కూడా ఉగ్రవాదులు పంపిన ఆడియో మెసేజీల్లో వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఉగ్రవాదుల హెచ్చరికలను తాను లక్ష్యపెట్టబోనని అమరీందర్ స్పష్టం చేశారు. కెనడాలో వారు తలలు బద్దలుగొట్టుకుని అరచినా, తాను చలించబోనని, అభివృద్ధి పైనే తన దృష్టని అన్నారు.

  • Loading...

More Telugu News