: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న కళాతపస్వి విశ్వనాథ్
రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు ఘనంగా 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతోంది. రాష్ట్రపతి చేతుల మీదుగా దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ దాదా సాహెబ్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వేదికపై కె.విశ్వనాథ్ సినీ విశేషాలను తెలుపుతూ ఏవీ ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు సహా దేశంలోని పలు భాషల సినీ ప్రముఖులు వచ్చారు. అవార్డును అందుకున్న తరువాత విశ్వనాథ్ మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కె.విశ్వనాథ్ సినిమాల్లో అశ్లీలత, ఫైటింగులు, హింస వంటివి ఉండబోవని, ప్రత్యేక శైలిలో ఆయన తెరకెక్కించిన సినిమాలు అత్యద్భుతమని కొనియాడారు.