: విజయవాడలో అగ్నిప్రమాదం... ఇద్దరు చిన్నారులు సజీవ దహనం
విజయవాడలోని పటమటలో ఘోరం జరిగింది. స్థానిక ట్రెజరీ కాలనీలో ఈ రోజు మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు లోకేశ్ (6), రాజేశ్ (2) సజీవ దహనమయ్యారు. ఈ చిన్నారులను గుడిసెల్లో వదిలి వారి తల్లిదండ్రులు పనికి వెళ్లినట్టు సమాచారం. కాగా, ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.