: హెచ్ సీఎల్ రావడం సంతోషకరం.. ఐఎస్బీ, మైక్రోసాఫ్ట్ ను కూడా కోరాం: నారా లోకేష్


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిభ వల్లే ఐటీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రోజు అమరావతిలో హెచ్ సీఎల్ ఇండస్ట్రీ అకాడమీ మీట్ జరిగింది. ఈ కార్యమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇక్కడకు హెచ్ సీఎల్ రావడం చాలా సంతోషకరమని చెప్పారు. ఏపీకి కొత్తకొత్త కంపెనీలు వస్తుండటంతో... యువతలో ఆత్మస్థైర్యం పెరుగుతోందని అన్నారు. అమరావతిలో సంస్థలను పెట్టాలని మైక్రోసాఫ్ట్, ఐఎస్బీలను కూడా కోరామని చెప్పారు. రానున్న రెండేళ్లలో ఐటీలో లక్ష ఉద్యోగాలు, తయారీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 

  • Loading...

More Telugu News