: యువరాజు, యువరాణి టాప్ లెస్ ఫోటోలపై విచారణ వేగవంతం!


2012లో దక్షిణ ఫ్రాన్స్‌ లో ఓ ఫాం హౌస్‌ లో ఇంగ్లండ్ యువరాజు దంపతులు విడిది చేసి, సేదదీరారు. అనుమతి లేకుండా మూడోవ్యక్తి ప్రవేశించలేని ఆ ఫాం హౌస్‌ లో యువరాణి కేట్ మిడిల్టన్, యువరాజుతో వ్యక్తిగతంగా సన్ బాత్ చేశారు. ఈ సందర్భంగా రహస్యంగా తీసిన ఫోటోలను... ఫ్రెంచ్ గాసిప్ మ్యాగజీన్, పేపర్ క్లోజర్ లో 2012 సెప్టెంబర్‌ సంచికల్లో ప్రచురించింది. 1997లో ప్రిన్సెస్ డయానాను ఫోటో జర్నలిస్టులు వెంటాడడం వల్లే మరణించిందని ప్రిన్స్ విలియమ్ బలంగా నమ్ముతున్నారు. అప్పటి నుంచి ఆయనకు మీడియాపై సదభిప్రాయం లేదు.

దీంతో తమ పరువుకు భంగం వాటిల్లే విధంగా ఫొటోలు ప్రచురించిన మ్యాగజీన్ నష్టపరిహారంగా 1.5 మిలియన్ యూరోలను చెల్లించాలని రాజదంపతులు ఫ్రెంచ్ కోర్టులో దావా వేశారు. ఈ కేసు విచారణ వేగవంతమైంది. క్లోజర్ మ్యాగజీన్ ఎడిటర్ లారెన్స్ పియు, ఒక సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు ఫొటో జర్నలిస్టులు, మరో ఇద్దరు ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్టులపై విచారణ జరుగుతోంది. వీరంతా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. ఆ ఫోటోలను తామ తీయలేదని, వేరే వారి నుంచి తీసుకుని ప్రచురించామని కోర్టుకు తెలిపారు. అయితే దీంతో న్యాయస్థానం ఏకీభవించలేదని తెలుస్తోంది. కాగా, అప్పట్లో తీసిన ఫోటోలు యూరోపియన్ పబ్లికేషన్స్ అయిన ఇటలీలో చే, స్వీడన్, డెన్మార్క్‌ లలో డైలీ స్టార్, సిస్టర్ మ్యాగజీన్స్‌ ల్లో ప్రచురితం అవుతుండటం గమనార్హం. 

  • Loading...

More Telugu News