: రవీంద్ర గైక్వాడ్ పై నిషేధం సరైనదే: ఎయిర్ ఇండియా చీఫ్
బీజేపీ ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై ఎయిరిండియా నిషేధం విధించడం సరైన నిర్ణయమేనని ఎయిర్ ఇండియా చీఫ్ అశ్వనీ లొహానీ స్పష్టం చేశారు. బిజినెస్ క్లాస్ సీట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ...ఎయిర్ ఇండియా ఉద్యోగిని ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చెప్పుతో కొట్టడంతో వివాదం చోటుచేసుకున్న అనంతరం తొలిసారి మాట్లాడిన ఆయన... ‘నా వరకూ సంస్థ ఉద్యోగులే నాకు ముఖ్యం. గైక్వాడ్ ఘటనలో మా ఉద్యోగులంతా ఎంతగానో బాధపడ్డారు. అది నేను తెలుసుకోగలిగాను. అందుకే గైక్వాడ్ పై చర్యలు తీసుకుని, పోలీస్ కేసు పెట్టాం’ అన్నారు. విమానయాన శాఖ కల్పించుకోవడంతో వివాదం ముగిసిన సంగతి తెలిసిందే.