: అమిత్ షాకు భోజనం పెట్టిన దంపతుల అదృశ్యం!


పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాజు మహాలీ దంపతులు అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ఆ రాష్ట్రంలోని నక్సల్ బరి ప్రాంతంలో పర్యటించారు. ఆ సందర్భంగా దక్షిణ కథియాజోట్ గ్రామానికి చెందిన రాజు మహాలీ అనే పెయింటర్ ఇంట్లో ఆయన భోజనం చేశారు. నేల మీద కూర్చొని అరిటాకులో అన్నం, పప్పుతో షా సంతృప్తిగా భోంచేశారు.

ఇది జరిగిన వారం రోజుల్లోనే రాజు, అతని భార్య గీత ఇద్దరూ అదృశ్యమయ్యారు. రెండు రోజులుగా వారు కనిపించడం లేదు. ఇప్పుడా ఈ విషయం ఆ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. వీరి అదృశ్యంపై బీజేపీ నేతలు నక్సల్ బరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అమిత్ షా పర్యటన తర్వాత రాజు కుటుంబాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేశారని... వారి నుంచి రాజు కుటుంబసభ్యులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారని బీజేపీ నేత దిలీప్ బరుయ్ మీడియాకు తెలిపారు. తృణమూల్ నేతలే రాజు దంపతులను కిడ్నాప్ చేసి ఉంటారని ఆయన ఆరోపించారు. 

  • Loading...

More Telugu News