: రాజమౌళి, రానాలకు ఫోన్ చేశా.. ప్రభాస్ కు చేయడం కుదరలేదు: చంద్రబాబు
హాలీవుడ్, బాలీవుడ్ లలో సైతం సత్తా చాటుతున్న 'బాహుబలి-2' సినిమాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదొక అద్భుతమైన సినిమా అని చెప్పారు. ప్రపంచ స్థాయి సినిమా తీసిన రాజమౌళిని అభినందిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించిన నేపథ్యంలో రాజమౌళి, రానాలకు ఫోన్ చేసి అభినందించానని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభాస్ విదేశాలకు వెళ్లినందున అతనికి ఫోన్ చేయడం కుదరలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 'బాహుబలి' బృందాన్ని త్వరలోనే సన్మానిస్తామని తెలిపారు. ఇంత గొప్ప సినిమాను ఆస్కార్ కు పంపాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్టు తెలిపారు.