: గాజులరామారంలో స్విమ్మింగ్ పూల్ లో బాలుడి మృతి
హైదరాబాదు శివారు గాజుల రామారం గ్రామ పరిధిలోని బ్లూడాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్ ను సునీల్ అనే వ్యక్తి ఏర్పాటు చేశారు. ఈ స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లిన హరీష్ (13) అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ హరీష్ బంధువులు స్విమ్మింగ్ పూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో రంగ ప్రవేశం చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడు సునీల్ ను అదుపులోకి తీసుకున్నారు. స్విమ్మింగ్ పూల్ లో ఎలాంటి రక్షణ సౌకర్యాలు చేపట్టలేదని గుర్తించారు. శిక్షణ పొందిన నిపుణులు కూడా అందుబాటులో లేరని గుర్తించి, బ్లూడాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్ ను సీజ్ చేశారు.