: నేడు ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో భేటీ... అటు నుంచి అటే అమెరికాకు పయనం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు (బుధవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రులతో సమావేశం అనంతరం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు అమెరికా పర్యటనకు వెళతారు. నేటి ఉదయం మొదట ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్ల గురించి చర్చించనున్నారు. అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి నరేంద్రసింగ్ తోమర్, నీతి  ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగారియాతో విడివిడిగా సమావేశం కానున్నారు.

అనంతరం వారం రోజుల పర్యటన నిమిత్తం నేటి రాత్రి 15 మంది బృందంతో అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. ఈ బృందంలో ఐటీ మంత్రి నారా లోకేశ్ లేరు. కాలిఫోర్నియాలో ఈనెల 8న జరగనున్న ‘అమెరికా భారత్ వ్యాపార మండలి (యూఎస్ఐబీసీ) సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబు తన పర్యటనలో ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల సీఈవోలతో భేటీ అవుతారు.

  • Loading...

More Telugu News