: వీసా నిబంధనలు కఠినతరం చేయడంపై ఆస్ట్రేలియా ప్రధానితో మాట్లాడిన మోదీ
అమెరికా బాటలోనే నడుస్తూ ఆస్ట్రేలియా ఇటీవలే తమ వీసా జారీలో కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో మన దేశ ఐటీ కంపెనీలకు, టెక్కీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రతిభావంతులైన నిపుణుల వీసా నిబంధనలు కఠినతరం చేయడం పట్ల మోదీ... ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్ బుల్ తో ఈ రోజు ఫోన్‌లో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా వీసా నిబంధనల్లో మార్పులపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మాల్కోమ్ ఇటీవలే భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ఆయన తన పర్యటన విజయవంతం చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగానే మోదీ ఆయనతో వీసా నిబంధనలపై చర్చించారు.