: క్రమశిక్షణ ఉల్లంఘన... గున్న ఏనుగుని ఎత్తిపడేసిన పెద్ద ఏనుగు.. మీరూ చూడండి!
ఓ గున్న ఏనుగుని పెద్ద ఏనుగు ఎత్తిపడేస్తుండగా తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గుంపులుగా వెళుతున్న ఏనుగుల్లో నుంచి ఓ గున్న ఏనుగు పక్కకు జరిగింది. దీంతో పక్క దారిలో వెళ్తున్న గున్న ఏనుగుపై కోపం తెచ్చుకున్న పెద్ద ఏనుగు దాన్ని తొండంతో లేపి పడేసింది. చివరికి ఆ గున్న ఏనుగు బుద్ధి తెచ్చుకొని సరైన దారిలో నడవడంతో వదిలేసింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని అడ్డో జాతీయ పార్క్లో చోటుచేసుకుంది. ఈ ఘటనను ఓ సందర్శకుడు తన వీడియోలో బంధించడంతో వెలుగులోకివచ్చింది. యూట్యూబ్లో ఈ వీడియోను ఎంతో మంది నెటిజన్లు చూస్తూ, పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి..